బాలీవుడ్‌ బ్యూటీతో సందీప్ డేటింగ్!

140
sundeep
- Advertisement -

సక్సెస్, ఫెయిల్యూర్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యువ హీరో సందీప్ కిషన్. ఇటీవల నిర్మాతగాను మారి సక్సెస్‌ను రుచిచూసిన సందీప్‌…త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. బీటౌన్ బ్యూటీతో డేటింగ్‌లో ఉన్నాడట సందీప్‌. ఇద్దరూ కలిసి కొన్ని పబ్లిక్ ఈవెంట్‌లలో కూడా కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చినట్లైంది.

ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు సోనియా రాథీ. హర్యానాకు చెందిన సోనియా రాథీ అమెరికా పౌరురాలు. సందీప్ తరచుగా ముంబైలో కన్పిస్తూ ఉండడం తెలిసిందే. ఇవన్నీ సందీప్‌, సోనియా డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకు ఊతమిస్తున్నాయి. త్వరలోనే ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టి గుడ్ న్యూస్ అందించనున్నారట ఈజంట. ఇక ప్రస్తుతం సందీప్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘మైఖేల్‌’తో సహా పలు చిత్రాల్లో చేస్తున్నారు.

- Advertisement -