కాంగ్రెస్,బీజేపీ డిపాజిట్లు గల్లంతు: హరీశ్‌ రావు

140
Minister Harish Rao
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీల డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయమన్నారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో భాగంగా రాయ‌పోల్ మండ‌లం ఎల్క‌ల్‌, బేగంపేట గ్రామాల్లో మంత్రి హ‌రీష్ రావు ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హ‌రీష్ రావు…. బావుల వ‌ద్ద మీట‌ర్లు బిగించే బీజేపీకి ఓటేసే ముందు ఒక్క‌సారి ఆలోచించాల‌ని సూచించారు. ఆ రెండు పార్టీలు దుబ్బాక‌కు చేసిందేమీ లేద‌న్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో సంక్షేమ ప‌థ‌కాలు బ్ర‌హ్మాండంగా అమ‌ల‌వుతున్నాయ‌ని తెలిపారు

టీఆర్ఎస్ పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు గుండెల్లో గుబులు పుట్టింద‌న్నారు. ఈ ఎన్నిక‌లో ఆ రెండు పార్టీల‌కు డిపాజిట్లు గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌మ‌న్నారు. నవంబ‌ర్ 3వ తేదీన సోలిపేట సుజాత రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. బీడీ కార్మికుల‌కు ఆసరా పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.

- Advertisement -