విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి హరీష్ సమావేశం

164
harishrao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా విత్తనోత్పత్తి పై రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ లో విత్తన కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమావేశం నిర్వహించగా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో విత్తన కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు హరీష్ రావు తెలిపారు.

విత్తనోత్పత్తి కి జిల్లా అన్ని విధాలుగా అనుకూలం అని తెలిపిన హరీశ్…విత్తనోత్పత్తికి కంపెనీ ప్రతినిధులకు ప్రజా ప్రతినిధులు,జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారం అందిస్తాం అన్నారు.విత్తనోత్పత్తి సాగు వల్ల విత్తన కంపెనీ లు, రైతులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు.

- Advertisement -