దటీజ్ హరీశ్‌రావు…

44
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాలం నుంచి సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. బీఆర్‌ఎస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా మంచి పేరున్న హరీశ్‌. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తామంటూ సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. అంతేకాదు తెలంగాణ ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆయన అందెవేసిన చెయ్యి.

కేసీఆర్‌ మేనల్లుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువ నేత. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజా నేత. క్షేత్రస్థాయిలో యువత, శ్రేణులను సమీకరించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయి ఉన్న వ్యూహరచయిత. కేసీఆర్‌ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. మామ అడుగుజాడల్లో నడిచే మహానేత.

ప్రజాసేవలో ఎప్పుడు ప్రత్యేక వైఖరిని అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతారు. కేవలం రాజకీయ విమర్శలను తీవ్రస్థాయిలో గుప్పించడంలో మాత్రమే కాదు. తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలో కూడా ఆయన ఇతరులకంటె చాలా యాక్టివ్ అని పలువురు అంటుంటారు. ఉద్యమ కాలం నుంచి ఎక్కడ సమస్య ఎదురైనా తనదైన శైలిలో ముందుకు వచ్చి నేనున్నాంటూ సమస్యను పరిష్కరించడంలో ముందుంటారు.

తన కోసం వచ్చిన కార్యకర్తలకు, సమస్యలను నివేదించడానికి వచ్చిన జనాలకు మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాస ప్రాంతం వద్ద క్యాంపు కార్యాలయం పక్కన ఉచిత భోజన వసతులను ఏర్పాటు చేశారు. తన కోసం ఎవరూ వచ్చిన జనాలకు ఉచితంగా పప్పు చారు చల్లతో భోజనం పెడతారు. అంతేకాదు సమస్య ఏదైనా సరే తన వద్దకు వస్తే ఇట్టే తీరిపోతదని జనాలకు నమ్మకం. ప్రజల కోసం మంచి చేయాలని అనుకునే నాయకులకు, సంకల్పం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి మంత్రి హరీశ్‌రావు నిదర్శనం.

ఇవి కూడా చదవండి…

” చిరు ” మావాడే

జగన్ సర్కార్ కు గట్టి దెబ్బ!

ఎకో టూరిజానికి ప్రోత్సాహం..

- Advertisement -