- Advertisement -
మల్బరీ సాగు తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు సాధించవచ్చన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లో రైతులు ఉమాపతి, ప్రభాకర్‌ల వ్యవసాయ క్షేత్రాల్లో మల్బరీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మల్బరీ తోటల సాగు మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతుందని మంత్రి చెప్పారు. మల్బరీ తోట సాగు చేస్తున్న రైతులు సైతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చని చెబుతున్నారని వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఏంపీటీసీలు, గ్రామ, మండలాల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
- Advertisement -