కేసీఆర్ అంటే నమ్మకం…కాంగ్రెస్ అంటే నాటకం అని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీష్…భుక్యా జాన్సన్ నాయక్ మంచి వ్యక్తి. బాగా చదువుకున్న వ్యక్తి, గత వ్యక్తి లాగా అవినీతి పరుడు కాదని తెలిపారు. ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చావు నోట్లో తల పెట్టీ తెలంగాణ సాధించారు కేసీఆర్ అని…ఒక్క ఛాన్స్ అని కాంగ్రెస్ అంటున్నది. 11 సార్లు గెలిచి ఏం చేసిందో ఆలోచించాలన్నారు. కనీసం మంచి నీళ్ళ గోస కూడా తీర్చలేదు..కేసిఆర్ ఇంటింటీకి నీళ్ళు ఇచ్చారన్నారు. విష జ్వరము లేవు, అంటు రోగాలు లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటే వార్త ఇప్పుడు పోతే వార్త అన్నారు.మహారాష్ట్ర బిజెపి పాలన, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ కోతలతో అల్లాడుతున్నారని కానీ తెలంగాణలో 24 గంటల నిరంతర కరెంట్ అందిస్తున్నామని చెప్పారు.
రేవంత్ రెడ్డి మూడు గంటలు చాలు అంటున్నారు…ఏది కావాలో ప్రజలు తెల్చుకోవాలన్నారు.బిజెపి బోరు కాడ మీటర్ పెట్టాలి అంటే, కేసీఆర్ గారు తన గొంతులో ప్రాణం ఉండగా పెట్టను అన్నారు…అందుకు కేంద్రం 35 వేల కోట్లు మనకు ఇవ్వకుండా ఆపిందన్నారు. బిజేపి ఓటు వేస్తే బోర్ల కాడ మీటర్లు, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంట్ అన్నారు. ఆడబిడ్డ పెళ్లి అంటే లక్ష రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ పాలనలో అడబిడ్డలని అమ్ముకునే దుస్థితి.. నేడు ఆడ బిడ్డ ఇంటికి లక్ష్మి అయ్యిందన్నారు.రైతు బంధు సృష్టికర్త కేసీఆర్, రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్ అన్నారు. ఎకరాకు 10 వేలు ఇచ్చాడు, 16 వేలు పెంచ బోతున్నం,పింఛన్లు 5 వేలు పెంచబోతున్నాం అన్నారు.
భూక్యా జాన్సన్…మా కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి అని, కేటీఆర్ కు మంచి దోస్త్, యువకుడు, విద్యావంతుడు జాన్సన్ మీ ఎమ్మెల్యే అయితే ఖానాపూర్ దశ, దిశ మారుతుందన్నారు.32 రోజులు కష్టపడి గెలిపించండి. జాన్సన్ 5 ఏళ్లు మీకు సేవ చేస్తాడన్నారు. కోర్టుల్లో కేసులు వేసేవారు మనకు వద్దని..4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు, రైతు బీమా ఇచ్చాడన్నారు.
Also Read:ఆ పార్టీలు అధికారంలోకి వస్తే కోతలే!