మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా మంత్రి హరీష్ రావు ఏడుపాయల వన దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సందర్బంగా టూరిజం కోసం రూ. 1500 కోట్లు.. ఏడుపాయలకు 100 కోట్ల రూపాయలు కేటాయించాము. 100 కోట్లతో ఫౌంటెన్స్ ,క్వార్ట్జ్ లు ,ఇతర అభివృద్ధి పనులు చెపడుతామని మంత్రి వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సింగూర్ కు లింక్ చేయడం వల్ల ఎడుపాయల్లో నీళ్లు ఎప్పుడు ఉంటాయి. ఏడుపాయల్లో గతంలో ఇళ్ళ కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్ కు నీళ్లు వస్తున్నాయి.. గతంలో నీళ్ల కొరత ఉండేది.. కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావు అని హేళన చేశారు. మల్లన్నసాగర్ అంటే జల ప్రవాహిని.. మల్లన్నసాగర్ నీళ్ల తో మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీష్ పేర్కొన్నారు.