సిద్దిపేట జిల్లాలో రూ.7 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గజ్వేల్- ప్రజ్ఞా పూర్ పురపాలక సంఘంను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. అలాగే గజ్వేల్‌లో అభివృద్ధి జాతర వీడియో సీడీనీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ,జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఫారుక్ హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటే రు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి గుప్తా, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేసిఆర్ గజ్వేల్‌లో కాలు పెట్టడమే గజ్వేల్ అదృష్టం.సీఎం ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారింది. గజ్వేల్ ప్రజలు కలలో కూడ ఊహించనంత అభివృద్ధి జరిగిందన్నారు.పాండవుల చెరువును కూడ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నింపిన ఘనత సీఎం దే అన్నారు. కసికడు నీళ్ల కోసం గోసపడ్డ గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తెచ్చి సాగు, త్రాగునీటి కష్టాలను సిఎం కేసిఆర్ దూరం చేశారు. తెలంగాణ సాగు, త్రాగు బాధలు తీర్చిన ఘనత సీఎం కేసిఆర్ దే. రోడ్ల మీద పండ్లు, పూలు, కూరగాయలు అమ్మే స్థితి నుంచి.. గజ్వేల్ సమీకృత మార్కెట్ లో విక్రయాలు స్థితికి గజ్వేల్ ఎదిగింది. గజ్వేల్ సమీకృత మార్కెట్ దేశానికే నమూనాగా నిలిచింది.
విదేశీ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు,అధికారులు గజ్వేల్ అభివృద్థిని అధ్యయనం చేసేందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు. రూ. 500 కోట్లతో గజ్వేల్ మాదిరి అన్ని మున్సిపాలిటీలలో సమీకృత మార్కెట్ ల నిర్మాణంకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం సారథ్యంలో సంగాపూర్ ను సింగా పూర్ గా చేసుకున్నాం.గజ్వేల్ నూతన మున్సిపల్ బిల్డింగ్ ఎంత సుదరంగో ఉందో…గజ్వేల్ ను అంత సుందరంగా మార్చాలి అన్నారు. గజ్వేల్ లో సుందర మున్సిపల్ బిల్డింగ్ ఆశీస్సులు అందించిన సీఎంకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు,ఉద్యోగుల పనితీరు కూడ బిల్డింగ్ మాదిరే ఉండాలి. గజ్వేల్ పట్టణంను హరిత పట్టణంగా తయారు చేసుకోవాలి. ప్లాస్టిక్, చెత్త రహిత , క్లీన్ పట్టణం గా గజ్వేల్ ను తీర్చిదిద్దాలి. గజ్వేల్ పట్టణ అభివృద్ధి వీడియో పాట ద్వారా కళ్లముందు ఉంచిన సంతోష్‌కు మంత్రి అభినందనలు తెలిపారు.