నిమ్స్ అభివృద్ధికి కృషి- మంత్రి హరీష్‌

76
harish
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఉన్న ఆసుపత్రులను ఆధునీకరిస్తూ, మరో వైపు కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిమ్స్‌లో పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌తో పాటు 200 ఐసియు పడకలను మంత్రి హరీష్‌ ప్రారంబించి, పర్యవేక్షించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, అలాగే SUVEN లైఫ్ సైన్సెస్ కలిసి NIMSలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో 200 ఐసియు బెడ్స్ ప్రారంభించుకున్నాం అన్నారు. సువెన్ ఫార్మాసుటిక‌ల్స్ సీఎండీ వెంక‌ట్ జాస్తికి, రోట‌రి క్ల‌బ్ ఆఫ్ జూబ్లిహిల్స్ అధ్య‌క్షులు పి సురేష్ గుప్తా, సెక్రెట‌రీ క‌ళ్యాణ్‌ లకు మంత్రి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. దాదాపు 4 కోట్లతో అనుకున్న స‌మ‌యంలో ప్రాజెక్టును పూర్తి చేసినందుకు వారికి అభినంద‌న‌లు.. కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి హరీష్‌.

స‌క‌ల స‌దుపాయాల‌తో కూడిన 6 ప‌డ‌క‌ల అత్యాధునిక మాడ్యుల‌ర్ కార్డియోథోరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇదని అన్నారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ స‌దుపాయానికి అనువైన క్లాస్‌-1 ఎయిర్ కండీష‌న్డ్ ఐసోలేష‌న్ క్లీన్ రూం. హార్ట్ లంగ్ మిష‌న్‌, నైట్రిక్ ఆక్సైడ్ స‌ర‌ఫ‌రా యంత్రం, బ్రాంకోస్కోప్‌, ఫొటోథెర‌పీ యూనిట్ వంటివి ఇందులో ఉన్నాయి తెలిపారు. పుట్టుక‌తో గుండె జ‌బ్బులు ఉన్న పిల్ల‌ల‌కు, ఇత‌ర పేద రోగుల‌కు ఈ యూనిట్ ద్వారా ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. మన ప్రభుత్వం 2 లక్షలు నుంచి 5 లక్షలు వరకు ఆరోగ్య శ్రీ ని పెంచడం జరిగింది. నిమ్స్ ఆసుపత్రులు హార్ట్ అండ్ కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయని..లంగ్ సర్జరీ లు కూడా చేస్తున్నారని మంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు..ప్రతీ సంవత్సరం 200 కోట్లు గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గత 6 నెలలు 186 కోట్ల రూపాలు ఏక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఐసియు 166 బెడ్స్ ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యని, మరో 200 అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 74 అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 440 ఐసియులో ఉంటాయని మంత్రి తెలపారు. గతంలో 68 ఉంటే ఇప్పుడు మరో 125 వెంటిలేటర్స్ ని మంజూరు చేసుకున్నాం. ఇందులో 25 అడ్వాన్స్ లైఫ్ వెంటిలేటర్ లు ఉన్నాయి. 5 ఎక్మో మెషిన్ లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

నిమ్స్ లో మొత్తం 5 CRRT మెషిన్ లను ప్రారంభించుకున్నాం. 50 కోట్లు రూపాయలతో 200 పడకల ఎమ్ సి హెచ్ బిల్డింగ్ కి త్వరలో అందుబాటులోకి తెస్తాము.ప్రస్తుతం నిమ్స్‌లో 1480 పడకలు ఉన్నాయి. త్వరలో 2000 పడకలు బిల్డింగ్ ని నిర్మించనున్నాం, పక్కనే ఉన్న ఎర్రమంజిల్ కాలనీ వద్ద గల ఉన్న 32 ఎకరాల్లో ఇది నిర్మిస్తామన్నారు. దీనికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులు త్వరలో ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. నిమ్స్ ఆసుప‌త్రికి ఎంతో మంచి పేరు ఉంది. పేరుకు త‌గ్గ‌ట్టే ఇక్క‌డ నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయి. అందుకే ఇక్క‌డికి పెద్ద సంఖ్య‌లో పేషెంట్లు వ‌స్తుంటారు. వారంద‌రికి అవ‌స‌ర‌మైన చికిత్స అన్ని వేళ‌లా అందించేందుకు మా నిమ్స్ వైద్య సిబ్బంది, ఇత‌ర సిబ్బంది ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండి అద్భుత‌మైన సేవ‌లందిస్తున్నారు.

మన ముఖ్యమంత్రి పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఉన్న ఆసుపత్రులను ఆధునీకరిస్తూ, మరో వైపు కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు తీర్చేలా..హైదరాబాద్‌ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హస్పిటళ్ల ఏర్పాటు జరుగుతున్నది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేస్తున్నది. నాలుగు ఆసుపత్రుల్లో సూపర్ స్పెషలాటి సేవలతో పాటు, కోర్స్ లు ప్రారంభిస్తాము. నిమ్స్‌లో కొన్ని డిపార్ట్మెంట్స్ కి కొత్త యూనిట్స్ పెంచాలని నిర్ణయచడం జరిగింది. ఈమేరకు 16 పీజీ సీట్లు పెంచడానికి ప్రతిపాదనలో ఎన్ఎమ్‌సి కి ప్రతిపాదనలు పంపడం జరిగిందని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -