నర్సుల ప్రేమ తల్లి లాంటిది- మంత్రి హరీశ్‌

122
minister harish
- Advertisement -

కన్నతల్లి కంటే ముందు మనల్ని స్పర్శించేది నర్సు.. కన్నతల్లి కంటే ముందు మనకు కదలిక నేర్పించేది నర్సు అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. గురువారం గాంధీ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మంత్రి హజరై అత్యుత్తమ సేవలు అందించిన నర్సులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. సమాజంలో డాక్టర్లకు ,స్టాఫ్ నర్స్ లుకు చాలా గౌరవం ఉంది. ఇది మొన్న కరోన సమయంలో నిరోపితమైంది అన్నారు. కన్న వాళ్ళు,కట్టుకున్న వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా నర్స్ లు సేవలు చేశారు. కొంతమంది నర్సులు మరణించినా.. మిగతా వారు అధైర్య పడకుండా సేవలు చేశారని మంత్రి కొనియాడారు.

స్టాఫ్ నర్స్ ల ప్రేమతల్లి లాంటిది ప్రేమ, స్టాఫ్ నర్స్ ల స్పర్శ తల్లి లాంటిది. పుట్టిన పిల్లలకు తొలి స్పర్శ తల్లి కన్నా నర్స్ కె దక్కుతుంది. నర్సింగ్ స్టూడెంట్స్ కి స్టే ఫండ్ ఎప్పుడో 6 నెలలకు వచ్చేది,అది కూడా చాలా తక్కువ 1500 స్టే ఫండ్ ని 5000కి పెంచిన, అలా 7000 వరకు పెంచడం జరిగింది. న‌ర్సింగ్ విద్య ప్రాధాన్యం, మ‌హిళ‌ల‌కు ఉన్న అపార అవ‌కాశాల‌ను దృష్టిలో పెట్టుకొని ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్య విద్య‌తో పాటు, న‌ర్సింగ్ విద్య‌ను ప‌టిష్టం చేయాల‌ని నిర్ణ‌యించారు. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటుతో పాటు న‌ర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు ముందు నర్సింగ్ కాలేజీ లు 6 ఉండే ఇప్పడు,33 కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. నర్సింగ్ స్కూళ్ల ను రానున్న రోజుల్లో అప్గ్రేడ్ చేస్తామని మంత్రి తెలిపారు.

నర్సింగ్‌లో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఎన్‌హెచ్ఎమ్ నుంచి కొంతమంది నర్స్ లకు ఎస్ఎన్‌సియూ లో శిక్షణ ఇస్తున్నాం. Mid wifery courses ట్రైనింగ్ ఇస్తున్నాం. అవసాన దశలో ఉన్న వారికి పాలిటీవ్ కేర్ లో ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. మెంటల్ హెల్త్ కి సంబంధించి స్టాఫ్ నర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం.. నర్సింగ్ సేవలు ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఇంతకు ముందు ప్రమోషన్ లో ఆలస్యము అయ్యేదే కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేవు. త్వరలో 4722 స్టాఫ్ నర్స్ ల నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నాం మంత్రి స్పష్టం చేశారు. 24 గంటలు పేషెంట్ ని కంటికి రెప్పలా కాపాడుకొనే వారు నర్స్ లు. తల్లి,తండ్రులు మీరు సేవలు చేస్తున్నారు,మీది గొప్ప వృత్తి.. ఒక్కరిద్దరు వలన చెడ్డ పేరు వస్తుంది,అలా జరగకుండా చూసుకోవాలి. కరోన సమయంలో పని చేసిన వారికి ఈ నోటిఫికేషన్ లో వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ ని బలోపేతం చేస్తాం.. నర్సింగ్ డైరెక్టరేట్ గురించి సీఎం కేసీఆర్ పాజిటివ్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని అధిగమించి వైద్యంలో దేశంలోనే 3 ప్లేస్ కి వచ్చాము. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు,ప్రత్యక్షంగా ప్రజలతో మమేకైమన జీవితం మీది. స్టాఫ్ నర్స్ గొప్ప తల్లిలాగా,చెల్లిలాగా మీరు సేవలు అందించాలి.మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో కొంతమంది నర్స్ లు చనిపోయారు,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సహయసహకారాలు కావాలన్న అందిస్తామని మంత్రి హరీశ్‌ అన్నారు.

- Advertisement -