బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలి- మంత్రి హరీష్

118
Minister Harish Rao
- Advertisement -

రైతు వ్యతిరేక బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా శుక్రవారం మూడవ, నాల్గవ నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో నిబద్ధతగల టీఆర్ఎస్‌.. అబద్ధాల బీజేపీకి మధ్యే పోటీ నెలకొందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

అమ్మకాల బీజేపీకి, నమ్మకానికి మారుపేరైన టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతోందంటూ వెల్లడించారు. అరాచకానికి.. అభివృద్దికి మధ్య, బొట్టు బిళ్లకు.. కల్యాణ లక్ష్మికి మధ్య పోటీ జరుగుతోందంటూ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకు లేవని మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -