కరోనా కొత్త వేరియంట్‌పై మంత్రి హరీష్‌ రావు సమీక్ష..

88
- Advertisement -

కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ప్రజా జీవనం మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై వ్యాప్తితో ప్రపంచవ్యాప్తం ఆందోళన వ్యక్తమవుతున్నది. దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఇది వేగంగా వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి, మరో వేవ్​కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఒమిక్రాన్​ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ నియంత్రణ, విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త వేరియంట్‌ ఉన్న దేశాల నుంచి రాకపోకలపై చర్చిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రేసింగ్‌, టెస్టింగ్‌ అంశంపై చర్చిస్తున్నారు.

- Advertisement -