మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ ప్రసంగం..

88

ఆదివారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 83వ మ‌న్ కీ బాత్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో ప్రధాని ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ప్రధాని మాట్లాడుతూ.. యువత జ‌నాభా అధికంగా ఉన్న ప్రతి దేశంలో మూడు విషయాలు అతి ముఖ్య‌మైన అంశ‌లుగా ఉంటాయ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆలోచనలు, ఆవిష్కరణ మొద‌టి అంశ‌మైతే, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించాల‌న్న సంకల్పం రెండ‌వ‌ద‌ని చెప్పారు. నేను చేయ‌గ‌ల‌ను అన్న న‌మ్మ‌కం మూడ‌వ‌ద‌ని చెప్పారు.

ఈ మూడు అంశాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం మ‌నం స్టార్టప్ అనే ప‌దాన్ని బాగా వింటున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఇది స్టార్టప్ యుగమ‌ని, అలాగే ఈ స్టార్టప్ ప్రపంచంలో మ‌న దేశం రాణిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయ‌న చెప్పారు. భార‌త్‌లోని చిన్న పట్టణాల్లోనూ స్టార్టప్‌ల పరిధి పెరిగిందని ఆయ‌న తెలిపారు.

అలాగే ఉత్త‌రప్ర‌దేశ్‌లోని జలౌన్ లోని నూన్ న‌దీ అంత‌రించిపోయే స్థితికి రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు దాన్ని కాపాడాల‌న్న సంక‌ల్పాన్ని తీసుకుని క‌మిటీ ఏర్పాటు చేసుకున్నార‌ని ప్రధాని చెప్పారు. చెరువును పున‌రుద్ధ‌రించుకున్నార‌ని మోదీ అన్నారు. స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్ నినాదానికి ఇది చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న చెప్పారు.

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను ప్రధాన మోదీ కోరారు. కోవిడ్-19 మహమ్మారి ఇంకా అంతం కాలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ వైరస్ రూపాంతరం ఒమిక్రాన్‌ను గుర్తించడంతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి ఇంకా ఉందని మర్చిపోవద్దని హెచ్చరించారు.