ఎడాదికి కోటి ఉద్యోగాలు ఎక్కడపోయాయి…? నల్ల ధనం ఏమైంది.. అక్కౌంట్లో 1500 లైనా వేశారా…? నిజామాబాద్ లో పసుపు బోర్డు ఎందుకు ఇంకా రాలేదు..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ ఉందా..? అంటూ బీజేపీకి మంత్రి హరీష్ రావు ప్రశ్నాస్త్రాలు సంధించారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దుబ్బాకకు కాంగ్రెస్, బిజెపి వాళ్లు ఎన్నికల ముందే వస్తారు. తరువాత మళ్లీ ఎప్పుడు కనిపించారు అని మంత్రి విమర్శించారు.
ఇంటింటికి నల్లా పెట్టి త్రాగు నీళ్లు ఎవరు ఇచ్చారు.. టీఆర్ఎస్ పార్టీ కాదా..!! సీఎం కేసీఆర్ అందరికి త్రాగు నీరు ఇచ్చారు.. మంచి నీళ్ల కష్టం తీర్చింది టీఆర్ఎస్ పార్టీ.. నాడు నీళ్ల కోసం బిందెలతో మహిళలు కొట్లాడేవారు. బోరింగులు కొట్టి ,నీళ్లు మేసి మహిళల చేతులు పోయేవి. కారు గుర్తు వల్ల పెన్షన్లు, మంచి నీరు, సాగునీరు, అందరికి వచ్చాయి. బిజెపి పరిపాలించే రాష్ట్రాలలో 400 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ కరోనా కష్ట సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అయింది. ఆడపిల్ల ఇయ్యల లక్ష్మీ అయ్యింది.. పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి లక్ష నూట పదహర్ల సహాయం చేస్తున్నాం. ప్రజలు అంతా కళ్యాణ లక్ష్మి ,ఉచిత కరెంటు, ఇంటింటి నల్ల నీరు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ కి, కారు గుర్తుకు ఓటు వేస్తాం అని అంటున్నారు.
బిజెపి వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. పెన్షన్లలో 16 పైసలు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదని రుజువు చేస్త, దుబ్బాక చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అని అడిగితే బీజేపీ నేతల నుంచి సమాధానం లేదు. బీజేపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారు కేసీఆర్ కిట్ లో రూపాయి కూడా కేంద్రానిది లేదు. బిజెపి వాళ్ళు అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తూ, ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకోవాలని చూస్తున్నారు… నిజం.. ధర్మం ఎప్పటికి గెలుస్తుంది అన్నారు. సీఎం కేసీఆర్ సముద్రం అంత ఇస్తే బిజెపి వాళ్ళు కాకి రెట్టంత మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో కాలి పోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ లతో రైతులు ఎంతో ఇబ్బంది పడేవారని మంత్రి తెలిపారు. కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారు. రైతు చనిపోతే 11 రోజులలో కాగితం,దరఖాస్తు లేకుండా 5 లక్షల రైతు బీమా ఇస్తున్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక లక్ష యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాము. మరో ముప్పై వేల ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయ్. బిజెపి ఏడాదికి కోటి ఉద్యోగలు ఇస్తామని చెప్పారు.. ఎక్కడ ఆరు కోట్ల ఉద్యోగాలు ? విదేశాలలో ఉండే నల్ల ధనం ఏమైంది ?.. ప్రతి అకౌంట్ కి 15 లక్షలు వస్తాయని అన్నారు.. 1500 కూడా రాలేదు అని మంత్రి ఎద్దేవ చేశారు. మరో మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటది..అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం, కారు గుర్తుకు ప్రజలు ఓటు వేయాలి. నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ తెస్తా అని చెప్పిన మాటలు ఏమయ్యాయి. యువకులు ఆలోచించాలి గోబెల్స్ ప్రచారాలు తిప్పి కొట్టాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్లకు లక్ష రూపాయలు,కేసీఆర్ కిట్, రైతులకు పెట్టుబడి,పెన్షన్లు,రైతు భీమా ఇస్తున్నారా…? యువత అందరూ ఆలోచించాలి.జరిగిన అభివృద్ధి చూడండి..జరగబోయే అభివృద్ధి చూడండి. టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయండి అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.