పేదలకు ఉచితంగా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలు: మంత్రి హరీష్‌

73
- Advertisement -

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రభుత్వ వైద్య రంగం అద్భుత ఫలితాలు సాధిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. గురువారం ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన కథనంపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. పది నుంచి 30 లక్షల వరకు ఖర్చయ్యే బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్య చికిత్స పేదలకు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా నిమ్స్, ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలో జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉచితంగా పేదలకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలు అందడం విశేషం. కార్పోరేట్ ఆస్పత్రుల్లో లభించే వైద్య సౌకర్యాలు సామాన్యులకు ప్రభుత్వ వైద్య రంగంలో అందుతున్నాయని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -