మేజర్ ఉన్నికృష్ణన్‌ను గుర్తుచేసుకున్న అడవి శేష్..

32
major

26/11 ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్ ఉన్ని కృష్ణన్‌ను గుర్తు చేసుకున్నారు హీరో అడవి శేష్. ముంబై ఉగ్రదాడుల్లో తమ ప్రాణాలను కొల్పోయిన వారిని స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు అడవి శేష్.

ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ తెరకెక్కుతుండగా విజువల్‌గా అద్భుతమైన టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ నటించిన పాన్ ఇండియా చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది. మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్ ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది.