మంత్రి హరీష్ రావుతో జూడాల చర్చలు.. సమ్మె విరమణ..

11

తెలంగాణ ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేసే వైద్యులు పీజీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కలిపించిన ఇన్‌ సర్వీస్‌ కోటా రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ శుక్రవారం జూనియర్‌ డాక్టర్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావును కలిశారు. ఈ సందర్భంగా జూడాల సమస్యల పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన సమ్మెను జూడాలు విరమించుకున్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన చేశారు.