డిపాజిట్‌ రాని పార్టీలకు ఓటు వేయకండి

378
Harish Rao
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హనుమంతాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీలకు ఓట్లు వేయవద్దని తెలిపారు. ఓటు వేసేముందు కాస్త ఆలోచించి వేయాలని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణరాష్ట్రం అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు.

అన్ని పార్టీలకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ ప్రజలే అన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించే పార్టీ ఎదో గుర్తించాలి. పనిమంతులు ఎవరో.. మాట తప్పని వారు ఎవరో గుర్తించి ఓటు వేయాలి. తెలంగాణ తెస్తా అని హామీ ఇచ్చి కేసీఆర్‌ నెరవేర్చారు.24 గంటల కరెంటు ఇస్తానని, పింఛను రూ.2వేలకు పెంచుతామని, రైతుబంధు, రైతు బీమా లపై హామీ ఇచ్చి సీఎం అమలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పనులు చేయించుకోవాలని తెలిపారు.

- Advertisement -