ప్రభుత్వ, ప్రయివేట్ వైద్యులకు శిక్షణ తరగతులుః మంత్రి హ‌రీశ్

186
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ వైద్యులకు విడతల వారీగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు ఆర్ధిక‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు. కరోనా నియంత్రణపై సిద్దిపేట కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు మంత్రి హరీశ్ రావు. ఈ సమీక్ష లో కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, జిల్లా ఆసుపత్రి, ప్రయివేట్ ఆసుపత్రుల వైద్యులు హాజరయ్యారు.

ఈసంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలను సద్వినియోగం చేసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా ముందస్తు జాగ్రత్తలో భాగంగా జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలలోని ప్రతిపాదిత ప్రాంతాలను ఎంపిక చేసుకుని 2 వేల ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు చేయాల‌న్నారు. జిల్లాకు మరో ట్యాoకు సోడియం హైపో క్లోరైడ్ మందు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మందును ప్రతి రోజూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రోజూ పొద్దున్న, సాయంత్రం నీళ్లలో కలిపి స్ప్రే చేయించాలని తెలిపారు. 24 గంటలు అహర్నిశలు ప్రజా రక్షణకు కృషి చేస్తున్న పోలీసు అధికారులు, ఎమర్జెన్సీ సర్వీసు అధికారుల కోసం మరో 10 వేల శానిటైజర్లను తెప్పించి పంపిణీ చేపట్టాలన్నారు.

- Advertisement -