వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత..కేసీఆర్‌దే

200
Minister Harish Rao Launches Rythu Bandhu Scheme
- Advertisement -

దేశంలోని రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రైతులకు పెట్టుబడి అందించే రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిన హరీష్…చెక్కులు,పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన హరీష్‌..వ్యవసాయాన్ని పండగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

రైతు కడుపు నిండా తిని, కంటినిండా నిద్ర పోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. భూమి కబ్జాలో ఉన్నవారికి పూర్తి హక్కులు కల్పిస్తున్నాం… ఇప్పుడు అసలైన లబ్ధిదారులను గుర్తించి పాసుపుస్తకాలను ఇస్తున్నామని తెలిపారు. రైతుల జీవితాల్లో ఇవాళ మరుపురాని రోజుని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో రైతుబంధు పథకాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. రైతుబంధు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని…. రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు రూ.12 వేల కోట్ల పెట్టుబడి సహాయం రెండు విడుతలుగా అందిస్తున్నామని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ఫలితాలు ప్రతి రైతుకు అందాలని వారు తెలిపారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

- Advertisement -