కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రతి సందర్భంలోనూ ఎండగడుతున్నాము. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ముందు నుండే చెబుతూ ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అంచనా వేసినట్టుగానే ధరలు భారీగా పెంచిన బీజేపీ ప్రభుత్వం, తన మోసపూరిత వైఖరిని మరోసారి చాటుకుందని మంత్రి మండిపడ్డారు.
ఓడ ఎక్కేదాక ఓడ మలన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న అన్న సామేత బీజేపీ పార్టీని చూసే వచ్చిందేమో. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు చెప్పి, ఎన్నికలు ముగియగానే తన ప్రజా వ్యతిరేక నైజాన్ని భయటపెడుతోందని మంత్రి విమర్శించారు.
తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచింది. ఎన్నికల వేళ దొంగ వినయం ప్రదర్శించిన బీజేపీ ప్రభుత్వం, ఎన్నికలు పూర్తి కాగానే ప్రజల నడ్డి విరిచేలా ధరలు పెంచింది. కరోనాతో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ధరల పెంపుతో కష్టాలు రెట్టింపు కానున్నాయంటూ.. మంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.