దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది- మంత్రి హరీష్‌

145
harish
- Advertisement -

సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రం, మంతుర్, అనాజ్ పూర్, తిమ్మక్క పల్లి గ్రామాల్లో దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీష్‌ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు.. 3 తేదీన ..మూడో నెంబర్ కారు గుర్తుకు ఓటు వేయండి.. మూడేళ్ళు మీ సేవలో ఉంటా… దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే.. రామలింగారెడ్డి ఎమ్మెల్యే లేకుంటే రాయ్ పోల్ మండలం అయ్యేదా.. రాయ్ పోల్ మండలాన్ని చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ ఘనత.. అని మంత్రి తెలిపారు.

ఏ దారిలో పోతే మనకు మేలు జరుగుతదో ప్రజలు ఆలోచించాలి. 70 ఏళ్లలో 50 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీకి ఓట్లు వేసినం.. వాళ్లు కనీసం తాగడానికి నీళ్లు ఇచ్చారా ? అదే కేసీఆర్ వచ్చాక ఇంటింటికీ నీళ్లు వచ్చాయి. కాళేశ్వరంతో కాలంతో, కరెంటుతో పని లేకుండా కాళ్లు అడ్డం పెడితే పొలానికి సాగు నీరు. యాసంగి ముగిసేనాటికి రాయ్ పోల్ మండలానికి కాళేశ్వరం జలాలు వస్తాయి. కరోనా వస్తే అదుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు.. కాంగ్రెస్, బిజెపొల్లు ఎవలైన వచ్చిండ్ల.. అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండగ చేస్తే, సీఎం కేసీఆర్ పండగ చేశారు. కేసీఆర్ మనసును గెలుచుకుని దుబ్బాక అభివృద్ధి చేసుకుందాం. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే.. దుబ్బాకలో అవకాశం ఇవ్వండి.. నా పనితనమేమిటో చూపిస్తా అని మంత్రి హరీష్‌ రావు కోరారు.

- Advertisement -