బీజేపీ నేతల అబద్దాలపై పోరు..

90
Minister gangula
- Advertisement -

కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విదానాలు, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు పై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లని మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు, ఈరోజు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసారు, జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఆందోళనల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొనాలని, వారిని సమన్వయపరుచుకొనే బాధ్యతలు నాయకులు చేపట్టాలని సూచించారు.

రాజ్యాంగం ప్రకారం ప్రతీ గింజను కొనే బాధ్యత గల కేంద్రం దాన్నుండి తప్పించుకుంటున్న తీరును రైతులకు సమగ్రంగా వివరించాలన్నారు, వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటుకు దోచిపెట్టే కుట్రల్ని చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు, తెలంగాణ రైతాంగానికి కించిత్ సహాయం చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, 24గంటల ఉచితకరెంటు, కాళేశ్వర జలాలతో ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న రైతును గందరగోళంలో పడేసేలా బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విదంగా శుక్రవారం దర్నాలు నిర్వహించాలని సూచించారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి భాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసులక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -