రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం:మంత్రి ఈటల

342
etela
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్స కి అందుబాటులో ఉన్న పద్ధతులను తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తాం అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.కరోనా కి రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలి.ఇన్ఫెక్షన్ డిసీజ్ లో నైపుణ్యం గల డాక్టర్స్ తో తెలంగాణ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల సూపరింటెండెంట్, చికిత్స అందిస్తున్న డాక్టర్స్ తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమెరికా కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ ఎల్దంది, హైదరాబాద్ కి చెందిన డా. ఎంవీ రావు, డా. సునీత , చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. మహబూబ్ ఖాన్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శంకర్, నిమ్స్ వైద్యులు డా. గంగాధర్ గార్లు ఆసుపత్రుల వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు.కరోనా వచ్చిన వారు జబ్బుతో కంటే భయం తో ఎక్కువ మంది చనిపోతున్నారు.

పాజిటివ్ పేషెంట్ల లో ధైర్యం నింపండి.యాంటీ వైరల్ మందులకంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయి.CT స్కాన్ వల్ల ప్రయోజనం లేదు.ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చన్నారు.

- Advertisement -