- Advertisement -
జిల్లా వైద్య అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ యూనివర్సిటీ వి సి కరుణాకర్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల..ఇప్పటికే అనేక వైరస్ లను ఎదుర్కొన్నాము.ప్రస్తుతం వైరస్ భయం అధిగమించాము. దీనిని ఎదుర్కోగలం అనే సత్తా సంపాదించుకునామని తెలిపారు.ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారిలో మాత్రమే ఎక్కువ ఇబ్బంది ఉందని….రాపిడ్ టెస్ట్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి phc లో పరీక్షలు చేస్తున్నాం అన్నారు. త్వరగా వైరస్ ఉందని నిర్ధారణ జరిగితే ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చు.ఆశా వర్కర్‌లు, జ్వరం వచ్చిన వారందరినీ వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు.
- Advertisement -