రాష్ట్రంలో కరోనా ప్రస్తుత పరిస్థితిపై బుధవారం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కారోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453 కి చేరింది. ఇందులో 45 మంది డిశ్చార్జ్ అయ్యారు, 11 మంది మృతి చెందారు, మరో 397 మంది చికిత్స పొందుతున్నట్టు మంత్రి తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో మందుల కొరత లేదు. 80 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 5 లక్షల పీపీఈ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. లక్షకు పైగా ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ మాస్క్ లు 2 కోట్లు ఆర్డర్ చేసాము, 5 లక్షల కళ్ళకు పెట్టుకునే గాగుల్స్ ఆర్డర్ చేసామని మంత్రి అన్నారు. 20 లక్షల గ్లౌజులు అందుబాటులో ఉండగా మరో కోటి గ్లౌజుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించారు.
కరోనాపై సీఎం కేసీఆర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వారితో కాంటాక్ట్ అయిన 3,158 మందిని క్వారంటైన్ చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వాళ్లను హోంక్వారంటైన్‌కు తరలిస్తామన్నారు మంత్రి. వీరంతా ఏప్రిల్ 21 వరకు కచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.
మార్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 1100 మంది వున్నారు. మార్కజ్ నుంచి వచ్చిన వారితో ఉన్న 3158 మందిని క్వరంటైన్ లో ఉంచాము. మార్కజ్ నుంచి వచ్చి పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని హోమ్ క్వరంటైన్ లో ఉంచాము. రోజు రెండు సార్లు వారి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నామని మంత్రి అన్నారు. 167 సెంటర్ ల నుంచి 3158 మంది ఈ క్వరంటైన్ లో ఉన్నారు. వారిని పరీక్షించి ఇంటికి పంపుతున్నాము.
ఇవాళ 535 శాంపిల్స్ పరీక్ష చేయాల్సి ఉంది. వీటికి రేపు రిపోర్టుర్స్ వస్తాయి. దీనితో మార్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో ఆక్టివ్ గా 397 కేసులు ఆన్నాయి. వీరిలో ఎవరు వెంటిలేటర్ మీద లేరు. అందులో కొందరికి టెస్ట్ లు చేసి నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామన్నారు.
టెస్టింగ్ కీట్స్ ని పెద్ద ఎత్తున్న ఆర్డర్ చేసాము. వైద్యలుకు అవసరమయ్యా అన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎక్కడ రిలాక్స్ కావద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రికార్డ్ సమయంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని కోవిడ్ ఆస్పత్రిగా సిద్ధం చేసాం. ప్రైవేట్ మెడికల్ ఆసుపత్రిలో 15 వెలకు పైగా బెడ్స్ సిద్దంగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.