మరింత వేగవంతంగా కరోనా నియంత్రణచర్యలు: ఈటల

200
etela
- Advertisement -

కరోనా నియంత్రణ చర్యలు మరింత వేగవంతం చేయాలన్నారు మంత్రి ఈటల రాజేందర్.నిర్ణయాల అమలు వేగం పెరగాలి..ప్రాథమిక దశలోనే కరోనా గుర్తించాలి..రాబోయే రోజుల్లో కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ తో చర్చించారు మంత్రి ఈటల రాజేందర్.

మార్చి 2 వ తేదీ న తెలంగాణ రాస్ట్రం లో కరోనా కేసు నమోదుఅయినప్పటి నుండి నేటి వరకు 108 రోజుల నుండి ఒక్కరోజు కూడా విరామం లేకుండా వైద్య ఆరోగ్య శాఖ కరోనా కట్టడికి కృషి చేస్తుంది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపద్యంలో ప్రాథమిక దశలోనే కట్టడి చేయడమే మార్గం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించి ఐసోలేట్ చేయాలని దీనికోసం సర్వేలెన్స్ పెంచాలని మంత్రి సూచించారు.

ఇప్పటి వరకు వైద్య శాఖ చేపట్టిన నియంత్రణ చర్యలను నూతన కార్యదర్శి రిజ్వీ తో చర్చించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై దీశానిర్ధేశం చేశారు. పరీక్షలు చేసుకున్న తరువాత తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడెలా చూడాలని, వ్యాప్తి చేయకుండా కట్టడి చేయాలని సూచించారు. GHMC పరిదిలోబస్తీ దావఖానాలు, అర్బన్ PHC లు పూర్తి స్థాయిలో డాక్టర్ లు సిబ్బంది మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. పీజీ లు పూర్తి చేసిన వారందరినీ సీనియర్ రెసిడెంట్ లుగా నియమించి వారి సేవలు వినియోగించుకోవాలని కోరారు.

నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వాటిని అంతే పకడ్బందీగా క్షేత్ర స్థాయి వరకు అమలు జరిగేలా చూడాలని రిజ్వీ ని మంత్రి కోరారు. హాసిటల్స్ కి సంబందించిన, సిబ్బందికి సంబండిచిన అన్ని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మార్గనిర్ధేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజల ప్రాణాలు రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది అని, ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించలేరని మంత్రి అన్నారు.

- Advertisement -