- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటు ముందుకెళ్లోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వైద్యాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని కరోనా వైరస్ పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు.
అలాగే వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, ఆశా వర్కర్లను బెదిరిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 272 కరోనా కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 228 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 33 మంది బాధితులు కోలుకుని డిశ్చార్ కాగా, కరోనాతో రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
- Advertisement -