డెంగ్యూతో ఎవరు చనిపోలేదు-మంత్రి ఈటెల

413
Minister Etela Rajender
- Advertisement -

వర్షాకాలం లో కలుషిత నీరు, దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల మెరుగైన చికిత్సను అందించగలుగుతున్నం. 2017 తో పోలిస్తే డెంగీ జ్వర తీవ్రత తక్కువగా ఉంది. ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం లేదు. కేవలం 5 శాతం మందిలో మాత్రమే ప్లేట్ లెట్స్ ఎక్కించల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం వస్తున్న జ్వరాల్లో 80 శాతం సాధారణ వైరల్ జ్వరాలు మాత్రమే. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

వైద్య ఆరగ్యశాఖ తీసుకుంటున్న చర్యల వల్ల డెంగీ నీ ముందే గుర్తించ గలుగుతున్నము. డెంగీ పరీక్షలు చేసే సెంటర్ల సంఖ్యను పెంచినం పరీక్షలు చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచాం. ఆగస్ట్ నెలలో 700 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు డెంగీ వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు.. జ్వరాల తీవ్రత దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

Minister Etela Rajender

రెండు రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ పూర్తిగా ఈ అంశం మీదనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫీవర్ హాస్పిటల్‌నీ పరిశీలించారు. ఇక్కడికి వచ్చిన రోగుల్లో ఎక్కువ మంది మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడ ప్రాంతానికి చెందిన వారు కావడంతో రేపు ఉదయం 9 గంటలకు దమ్మయిగూడ కమ్యూనిటీ హాల్ లో హోమియో మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ ఈ క్యాంప్‌కి హాజరై హోమియో మందులు పంపిణీ చేయనున్నారు.

ఈ మందుల వల్ల వ్యాధి నిరోధకత పెరిగి డెంగీ తీవ్రత తగ్గనుంది.10 గంటలకు రామంతపూర్ లోని హోమియో మెడికల్ కాలేజ్‌లో డెంగీకి హోమియో మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు ghmcలో GHMC,అరోగ్య శాఖ సమన్వయ కమిటీ సమావేశంకు హాజరవుతారు. GHMC పరిధిలో దోమల నివారణకు, పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేయనున్నారు. ఈ రోజు కోటి లోని వైద్య విద్యా సంచలకుల కార్యాలయంలో జరిగిన సమావేశంలో డెంగీ చికిత్స, నివారణపై సుదీర్ఘంగా చర్చించారు.

- Advertisement -