అందరికి కరోనా వ్యాక్సిన్‌: ఈటల

206
Minister Etela
- Advertisement -

అందరికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. సంవత్సరం నుంచి కరోనాకు ట్రీట్మెంట్ ఇస్తున్న గాంధీ ఆస్పత్రి సిబ్బందికి సన్మానం కార్యక్రమం జరుగగా మంత్రి తలసానితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల.

ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల..తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది..ఈ 365 రోజుల కాలం లో కదిలిస్తే కన్నీళ్లే వచ్చే విధంగా సిబ్బంది సేవ చేశారని చెప్పారు. మన రాష్ట్రానికి కోవిడ్ కేసు వచ్చే ముందు ఇతర దేశాల్లో ఎంతో సివియర్ గా ఉందని…ఆ సమయంలో కోవిడ్ ఇండియా కి వస్తే శవాల గుట్టలే ఉంటాయని అనుకున్నారని తెలిపారు.

కానీ ఇక్కడి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో త్వరగా కట్టడి చేసాం….కరోనాతో ఎంతో సైన్స్ ఉన్నప్పటికీ వేదన అనుభవించాం..డాక్టర్లను ప్రజలు గుర్తించి గుండెల్లో పెట్టుకునే రోజులు వచ్చాయన్నారు. ప్రైవేటు హాస్పిటల్ లు మూతపడిన ప్రజలకు సేవ చేసేవి ప్రభుత్వ హాస్పిటల్ లు మాత్రమే అని గుర్తించారు..ప్రభుత్వ హాస్పిటల్ ల పైన ఉన్న ఒక భావన పోయి ప్రజల్లో మా డాక్టర్లు అనే భావన వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్ లకు మరింత పేరు ఉండాలి…గాంధీ హాస్పిటల్ లో కొత్తగా 35 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలు రూపొందిస్తున్నాం అన్నారు.

ఆరోగ్యానికి కేంద్రంగా గాంధీ కాబోతోంది….యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో డాక్టర్లు లేని పరిస్థితి ఉందన్నారు. డాక్టర్లు జీతాల కోసం పనిచేయలేదు ఒక సేవ దృక్పథంతో పని చేశారు..మీ కష్టాలను,బాధలను ప్రభుత్వం గుర్తిస్తుంది..డెడ్ బాడీ తీసుకుపోవడానికి రాకపోతే మనమే ఖననం చేశామన్నారు.

- Advertisement -