ఎంపీ సంతోష్ పిలుపుకు స్పందించిన హోంమంత్రి..

119
ali twitter
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా మలక్ పెట్ అజంపురా లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో మొక్కలు నాటారు హోంమంత్రి మహమ్మద్ అలీ.

అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. జన్మదిన సందర్భంగా ఇతర కార్యక్రమాలు చేపట్టకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మొక్కలు నాటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆజం హలీ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి , తీగల సునరీతా రెడ్డి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -