తమిళనాడు ఎన్నికలు: స్టాలిన్ వర్సెస్ ఖుష్బూ

83
modi

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పొలిటికల్ వాతావరణం రోజురోజుకి హీటెక్కుతోంది.అధికార అన్నాడీఎంకే- విపక్ష డీఎంకే కూటమి మధ్య మాటల తూటాలు పేలుతుండగా ఇక ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నారు డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్‌.

డీఎంకేకు మంచి పట్టున్న చెపాక్ నియోజకవర్గం నుండి ఉదయనిధి స్టాలిన్ బరిలోకి దిగనుండగా ఈ నెల 7న తిరుచిరాపల్లిలో జరగనున్న డీఎంకే సమావేశాల్లో ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసే విషయమై అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో స్టాలిన్ కుమారుడికి గట్టి ప్రత్యర్థిని పోటీలోకి దింపాలని భావిస్తున్న అన్నాడీఎంకే కూటమి ఇందుకు సంబంధించి బీజేపీ నేత ఖుష్బూను రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఉదయనిధి తాత అయిన తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి చెపాక్ నియోజకవర్గం నుంచే మూడు సార్లు పోటీ చేసి గెలిచారు. ఇక స్టాలిన్‌ తనకు కలిసొచ్చిన కొలత్తూర్ నుండి బరిలోకి దిగనున్నారు. 2011కి ముందు థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు స్టాలిన్.