నర్సంపేట మోడల్‌ స్కూల్‌ని సందర్శించిన మంత్రులు..

109
errabelli
- Advertisement -

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట లోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీ ని సందర్శించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రులు మోడల్ స్కూల్, కాలేజీని పరిశీలించారు.

స్కూల్ కూల్ కాలేజీ లోని విద్యార్థుల, ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఖ్యని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఇతర సదుపాయాలు, బోధన పద్ధతులు, ఉత్తీర్ణత శాతం వంటి అంశాలను ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులన్నీ సరిపోతున్నాయా? లేదా? ఇంకా ఇతర అవసరాలు ఏమిటనే విషయాలను మంత్రులు ఆరా తీశారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం క్లాసులు నిర్వహిస్తే సమస్యలేమైనా ఉంటాయా? అని అడిగారు. ఈ సందర్భంగా మంత్రుల కి మోడల్ స్కూల్ కు సంబంధించిన అన్ని విషయాలను సంబంధిత ప్రిన్సిపాల్ తెలియజేశారు. స్కూలు, కాలేజీ కి ఇతర అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారని వారికి నిర్ణీత ప్రమాణాల ప్రకారం భోజన బోధన కల్పిస్తున్నట్లు చెప్పారు. మోడల్ స్కూలు, కాలేజీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు, విద్యార్థులకు మంచి భోజనం విద్యాబోధన కల్పిస్తూ వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రులు ప్రిన్సిపల్, టీచర్లను కోరారు.

- Advertisement -