దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం పండగను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. జాతర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రులు…కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు కేంద్రం రూ. 325 కోట్లు కేటాయించింది… మరి మేడారం జాతరకు కేవలం రూ. రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.ఇది ఆదివాసీలను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. మినీ కుంభమేళా అయిన మేడారం జాతర ఏం పాపం చేసింది? అని నిలదీశారు.
బీజేపీ నాయకుల వైఖరి కారణంగా తాము కూడా రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఇంతటి గొప్ప జాతరను జాతీయ పండుగగా ఎందుకు ప్రకటించడం లేదన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు… మా గిరిజన విద్యార్థులు మీకు కనిపించడం లేదా? అన్నారు.
మేడారం జాతరలోనూ బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని…. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతర ఏర్పాట్లు చేసి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.