పేదల సుస్తి పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు: హరీశ్ రావు

54
basthi dawakhana
- Advertisement -

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, LIG భారతీ నగరి కాలనీలో బస్తీ‌దవాఖానాలప ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు‌.ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ గాకటరు బస్తీ దవాఖానాలు ప్రారంభించారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది వైద్య సేనలు అందిస్తారన్నారు.

ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారని తెలిపిన హరీష్ రావు…ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు‌ వృధా చేసుకోవద్దన్నారు. బస్తీ దవాఖానాలు‌ అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం సూచించిందని….టీ డయాగ్నసిస్ ద్వారా మీరు రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు అందుతుందన్నారు.

హైదరాబాద్ పరిధిలో 256 బస్తీ‌దవాఖానాల‌ ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేల‌మంది ఉచిత‌ వైద్యం అందుతోందన్నారు. పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక మందులు‌ లేవు అన్న సమస్యే ఉండదన్నారు.గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందే అన్ని రకాల వైద్య సేవలు, గుండె,‌కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు ఉచితంగా పేదలకు టిమ్స్ ద్వారా అందిస్తాం అన్నారు.

- Advertisement -