ప్రతి రోజు ఎంజీఎం కరోనా బులెటిన్ : మంత్రి ఎర్రబెల్లి

197
errabelli
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్,వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎంజీఎం,PMSSY హాస్పిటల్ ల అభివృద్ది, కరోనా బాధితులకు ఇవ్వాల్సిన చికిత్స,కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.

MGM మరియు PMSSY దవాఖానలలో మొత్తం 600 బెడ్లను కోవిడ్ చికిత్స కొరకు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంజీఎంలో ప్రస్తుతం 250 బెడ్స్ కరోనా చికిత్స కొరకు సిద్దంగా ఉన్నాయి….వారం రోజులలో 100 సిలిండర్స్ ఏర్పాటు చేసుకొని ఇంకొక 50 బెడ్స్ కోవిడ్ చికిత్స అందుబాటులో తెస్తాం అన్నారు.

PMSSY హాస్పిటల్ లో 106 బెడ్స్ ను 20 రోజులలో కరోనా చికిత్సకు అందుబాటులోకి వస్తాయి…ఇప్పటి వరకు PG కోర్సు పూర్తి చేసిన 117మందికి సీనియర్ రెసిడెంట్స్ పోస్టింగ్ ఇస్తే 88 మంది మాత్రమే జాయిన్ అయి అందులో 68 మంది విధులకు హాజరవుతున్నారని చెప్పారు. 29 మంది MBBS డాక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వగా, ఇప్పటివరకూ 10 మంది మాత్రమే చేరానని తెలిపారు.

సీఎం కేసీఅర్ మంజూరు చేసిన 13 కే.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ లను MGM లో , PMSSY కే.యం.సి లో ఏర్పాటు చేసి 350 బెడ్లు సత్వరమే ఏర్పాటు చేస్తాం…MGM హాస్పిటల్ కు (1) ఎక్సరే మిషన్, (20) బైపాప్ మరియు (10) సక్సేన్ మిషన్ యం.పి (రాజ్యసభ) నిధులు ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

21 సిసి కెమెరాలు కోవిడ్ వార్డులలో అమర్చి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..5000 PPE కిట్లు,20000 N-95 మాస్కులు ,రేమిడిసిఫార్ -200, ఫావి ఫిరావిర్ -4000 మందులు హాస్పిటల్స్ లో సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మైల్డ్ పేషెంట్స్ ను హోమ్ ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నాం..మధ్యస్థ లక్షణాలు ఆ పై లక్షణాలుంటే MGM లో చేర్చుకొని వెంటిలేటర్స్, ఆక్సిజన్ అవసరము మేరకు అందించి చికిత్స చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్,గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ హన్మంతు షిండే,మేయర్ గుండా ప్రకాష్ రావు,కమిషనర్ పమేలా సత్పతి , డీఎం & హెచ్ ఓ,సూపరింటెండెంట్ లు,వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -