బీజేపీవి అబద్ధాల మాటలు… అసత్య ప్రచారాలు: ఎర్రబెల్లి

152
errabelli
- Advertisement -

బీజేపీవి అబద్దాల మాటలు…అసత్య ప్రచారాలని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…పొగిడిన నోటితోనే… తెగడ్తలు చేయడం బీజేపీ నేతలకే చెల్లిందన్నారు. సాక్షాత్తు ప్రధాని, కేంద్ర మంత్రులు అభినందిస్తారు….రాష్ట్ర నాయకులు విమర్శిస్తారని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు నయా పైసా ఇచ్చారా? అని ప్రశ్నించిన ఎర్రబెల్లి…నీతి అయోగ్ చెప్పినా, మిషన్ భగీరథకు నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. సంక్షేమంలో మన రాష్ట్రమే నెంబర్ వన్ అని తెలిపిన ఎర్రబెల్లి….ఉపాధి హామీలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని అభినందిస్తూ, రాష్ట్రంలో కూలీలకు ఉపాధి లేదని బుకాయింపులా? అని దుయ్యబట్టారు.

అబద్ధాలతో… అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు ఆరాట పడుతున్నారని తెలిపిన ఎర్రబెల్లి….ప్రజలను రెచ్చగొట్టి, లబ్ధి పొందే దురుద్దేశంతో ఉందన్నారు. ప్రజల సెంటిమెంట్ల తో రాజకీయాలు వద్దు అని సూచించిన ఎర్రబెల్లి…వరంగల్, హైదరాబాద్ లకు వరద సాయం మీరెందుకు ఇవ్వలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతా? అని ప్రశ్నించారు. వరంగల్ అభివృద్ధి పై అధికారిక చర్చకు బిజెపి సిద్ధమా? అన్నారు. ప్రజలు, మీడియా సంక్షంలోనే ఎవరు చేసిన అభివృద్ధి ఏంటో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.

- Advertisement -