ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య రంగంలో అద్భుత పురోగతి సాధిస్తుందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో రూ.2.14కోట్ల విలువైన కొత్త సిటీస్కాన్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్‌రావు పనితనంతో వైద్యశాఖలో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
పాత సెంట్రల్ జైలు స్థలంలో రూ.1100కోట్లతో 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే వరంగల్‌లో ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎర్రబెల్లి తెలిపారు.
కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలతో పాటు ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. అత్యసవర విభాగంలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ ద్వారా అత్యవసర చికిత్సలు అందించేందుకు వీలవుతుందన్నారు.