అమెజాన్ చేతిలో అఖిల్..ఏజెంట్..!

130
akil
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఏజెంట్. స‌క్సెస్ రుచి కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్న అఖిల్..ఈ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త వైర‌ల్‌గా మారింది. సినిమా విడుద‌ల కాక‌ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌.

ఇక ఈ సినిమాలో అఖిల్ ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అఖిల్ లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి సురేంద‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -