కరోనా కట్టడికి రాజకీయాలకు అతీతంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల వారీగా, ఒక్కో మండలం నుంచి 120 మందికి పైగా ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ సహా అన్ని శాఖల అధికారులు, పోలీసులు, పలువురు ప్రముఖులతో మంత్రి, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ ఊరికి ఆ ఊరే కట్టడి కావాలె. కరోనాను కట్టడి చేయాలె..ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యూత్ ని ఏక తాటిపైకి తేవాలన్నారు.
గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేయాలి.. కలిసి వచ్చేవాళ్ళందరినీ కలుపుకుపోవాలన్నారు… ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఇంట్లో వాళ్ళందరికీ పరీక్షలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులు, అధికారులకు దండన విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే నియోజకవర్గానికి రెండు అంబులెన్సులు, 4లక్షల మాస్కులు అందిస్తామన్నారు.