పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా సీఎం కేసీఆర్: ఎర్రబెల్లి

224
errabelli
- Advertisement -

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి పెద్దన్నగా మారి సీఎం కేసీఅర్ కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

రాయపర్తి మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో 126 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు కట్నంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబార్ చెక్కులు అందించి పేదల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇక కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. స్వరాష్ట్ర సాధన, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం బాపూజీ ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను ఉంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తి గా కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.

- Advertisement -