రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పైలెట్ వెహికిల్ ను, వెనుక నుండి వస్తున్న బైక్ రైడర్ డీ కొట్టాడు. వేగంగా వచ్చి డీ కొట్టడంతో బైక్ పై ఉన్నఇద్దరు గాయపడ్డారు. మంత్రి దయాకరరావు తక్షణమే స్పందించి, తన పైలట్ కారులో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స కొనసాగించే ఏర్పాటు చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఉదయం బయలుదేరారు. రాయగిరీ సమీపంలో మంత్రి వెహికిల్ ను ఆకస్మాత్తుగా లెఫ్ట్ వైపు తిప్పడం, వెనువెంటనే వెనుక ఉన్న పైలట్ కారు పక్కకు తప్పించారు. ఆ వెహికిల్స్ వెనుకే వేగంగా బైక్ పై వస్తున్న హన్మకొండ వాసులు , వెహికిల్ స్పీడ్ ను నియత్రించలేక, మంత్రి కాన్వాయ్ లోని కారు ను డీ కొట్టి గాయపడ్డారు. జరిగిన తప్పిదాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గుర్తించి, గాయపడ్డ ఇద్దరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ తమ కారులోనే తరలించి, మానవత్వాన్ని చాటుకున్నారు.