- Advertisement -
హైదరాబాద్ మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీలో కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేయగా.. వారికి మంత్రి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభుదాస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కైలాసగిరిలో ఇంటింటీ ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి… ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభివృద్ధికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అండగా నిలవాలని, తలలో నాలుకలా పని చేసే ప్రభుదాస్నే డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించాలని కోరారు.
కరోనా, భారీ వరదలు వచ్చిన సమయాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఎన్నికల తర్వాత సైతం ప్రభుత్వ వరద సహాయం అందిస్తుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇంతలా ప్రజల కోసం ఆలోచించడం చూశారా? అని ప్రశ్నించారు.
- Advertisement -