విజ్ఞతతో ఆలోచించండి…అభివృద్ధికి ఓటేయండి

147
errabelli
- Advertisement -

ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి…అభివృద్ధి ని చూసి ఓటు వేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మీర్ పేట్ హౌసింగ్ కాలనీ డివిజన్ పరిధిలోని లక్ష్మి నగర్, చైతన్య నగర్, ఇందిరా నగర్ తదితర కాలనీల్లో అభ్యర్థి ప్రభుదాస్ ను వెంటపెట్టుకుని, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో పాటు పాద యాత్ర నిర్వహించి, ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను కలిశారు.

గ్రేటర్ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌కు ఓటేయాలని ఈ సందర్బంగా కోరారు ఎర్రబెల్లి. గల్లీ కావాలో, ఢిల్లీ కావాలో తేల్చుకోండి….మీర్ పేట్ మరింత అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నానని తెలిపారు. సీఎం కేసిఆర్, మంత్రి కెటిఆర్ ల ఆశీస్సులతో మీర్ పేట్ డివిజన్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం అన్నారు. ప్రతి పక్షాల మాయ మాటలు నమ్మకండి….అభివృద్ధికి కట్టుబడిన టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలన్నారు.

- Advertisement -