- Advertisement -
సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరంతో గ్రామాలకు జలకళ సంతరించుకుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చెరువులో చేప పిల్లలను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి…మత్య్సకారుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయంలోనే కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని…తెలంగాణ రాష్ట్ర అభివృధే సీఎం కెసిఆర్ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు చేపల దిగుమతి చేయాలనేదే సీఎం కెసిఆర్ లక్ష్యం అన్నారు. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను అందించిన గొప్ప వ్యక్తి సీఎం కెసిఆర్.…కరోనా వైరస్ రాకుండా ప్రజలు జాగ్త్రత పడాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు ఎర్రబెల్లి.
- Advertisement -