ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి: ఎర్రబెల్లి

170
Minister errabelli
- Advertisement -

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఎర్రబెల్లి…కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలన్నారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.ప‌ల్లె ప్రకృతి వ‌నాల మెయింటెనెన్స్ పై కొన్ని ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో, పల్లె ప్రకృతి వనాలలో క్రమంతప్పకుండా చెట్లకు నీళ్లు పోయాలని మంత్రి ఆదేశించారు.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూడాలి. అన్ని బహిరంగ ప్రదేశాలలో సోడియంహైపోక్లోరైడ్ తో శానిటేషన్ చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు వారు ప‌ని చేసే చోట నీడ, తాగు నీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వేసవిలో గ్రామ పంచాయతీలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కరోనా నియంత్రణపై వారికి దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -