టీఆర్ఎస్‌ది రైతుల మేలుకోరే ప్రభుత్వం: ఈటల

41
etala

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల మేలు కోరే ప్రభుత్వమన్నారు మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ మండలంలోని రాజపల్లి, జమ్మికుంటలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈటల.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..చివరి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు రైతుల మేలుకోరే ప్రభుత్వమని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం శుభ్రం చేసి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. మిల్లర్లు తిరకాసులు పెట్టకుండా రైతుల ధాన్యాన్ని తీసుకోవాలని, ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.