సహజ కవి బమ్మెర పోతనామాత్యుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి ఈ రోజు భాగవత దినోత్సవంగా జరుపుకుంటారు …మహా భాగవతము రచించిన, తెలుగు వారు గర్వించదగ్గ మహాకవి బమ్మెర పోతన అన్నారు. పోతన జన్మించిన గ్రామం బమ్మెర నా నియోజకవర్గం లో వుండటం నా అదృష్టం అన్నారు.
ఇంత చారిత్రాత్మక, కవితాత్మక, తెలుగుని ప్రపంచ భాష గా నిలిపిన ప్రముఖులు ఉన్న ప్రాంతం నా నియోజకవర్గం…అది కవి, తొలి తెలుగు విప్లవ కవి, ప్రజల భాషలో గ్రంథాలు రాసిన పాల్కురికి సోమనాథుడు, సహజ కవి, తన గ్రంథాలను రాజులకు అంకితం ఇవ్వడానికి ఒప్పుకొని ఆత్మ గౌరవ కవి బమ్మెర పోతనామాత్యుడు జన్మించిన, వాల్మీకి ఆశ్రమం, సీతా రాముల తనయులు లవకుశులు జన్మస్థానం వాల్మీకి పురం – వల్మీడి, పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సీఎం కేసిఆర్ టూరిజం హబ్ చేయాలని నిర్ణయించారని చెప్పారు.
సీఎం కేసిఆర్ నిర్ణయం మేరకు అభివృద్ది పనులు కూడా చకచకా సాగుతున్నాయన్నారు.సీఎం కేసిఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ది చేస్తున్నాం అన్నారు. పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.