కరోనా హోమ్ క్వారంటైన్ వెసులు బాటుని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఉత్సాహంగా, ఉల్లాసంగా క్యారమ్స్ ఆడారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బందులు కావొద్దనే ఉద్దేశ్యంతోనే సీఎం కెసిఆర్ తెలంగాణలో వెసులు బాటు ఇచ్చారన్నారు. అయితే, అందివచ్చిన స్వేచ్ఛని యధేచ్ఛగా వాడుకోవద్దన్నారు. దుర్వినియోగం చేస్తే కరోనా విజృభిస్తుందన్నరు. కరోనా తగ్గుముఖం పట్టడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, ఈ లోగా మనకు మనం కరోనా వైరస్ విస్తృతికి కారణంకారాదని మంత్రి ప్రజలకు హితవు పలికారు.
ప్రజలు స్వీయ నియంత్రణని పాటించాలని, కుటుంబ సభ్యులతో హాయిగా గడపాలని సూచించారు.ప్రజలు పూర్తి స్వీయ నియంత్రణ పాటిస్తూ, అధికారులు, పోలీసులకు సహకరించాలన్నారు. సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యల కారణంగానే తెలంగాణ ప్రజలు తక్కువ కరోనా ఎఫెక్ట్ తో, ఎక్కువ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారని, త్వరలోనే మన రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యక్తం చేశారు.