చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి

223
errabelli
- Advertisement -

చాకలి ఐలమ్మ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆనాడు ఆమె భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని…ఆదే భూమి రైతుకు చెందడం కోసం సీఎం కేసిఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. పాలకుర్తిలో తన చేత వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టించిన ఐలమ్మ వారసులను అభినందిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 125వ జయంతి సందర్భంగా వారి సొంతూరు అయిన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం రాజీవ్ చౌరస్తాలో గల ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడిన ఎర్రబెల్లి….నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.
ఉద్యమ యోధులు ఐలమ్మ లాంటి వారు నా నియోజకవర్గ ప్రాంతంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నానని…వారు చేసిన ఆనాటి ఉద్యమమే మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందన్నారు.

చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని…ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టిన మహనీయురాలు అన్నారు. చాకలి ఐలమ్మ ఆనాడు భూమి కోసం భుక్తి కోసం పోరాడింది. అదే భూమి రైతుకు చెందడం కోసం సీఎం కేసిఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని చెప్పారు. ఈ చట్టం ద్వారా దున్నే రైతుకు భూమి లభిస్తుంది…ఈ చట్టాన్ని చూసి రాష్ట్రంలోని రైతులు ఆనంద పరవశంలో ఉన్నారని చెప్పారు.

మనమేమో నూతన రెవెన్యూ చట్టంతో రైతుకు న్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయాన్ని కార్పొరేట్ల కు అందించి వారికి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం వ్యవసాయంపై వారి ఆలోచనను విరమించు కోవాలన్నారు.

- Advertisement -